ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రూ.5.5 కోట్ల చెక్ ను అందజేసిన ఎల్ అండ్ టీ

వరద బాధితుల సహాయార్థం సీఎం సహాయ నిధికి లార్సెన్ అండ్ టూబ్రో సంస్థ 5.50 కోట్ల రూపాయల విరాళం అందించింది. L&T చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎస్.ఎన్.సుబ్రమణ్యన్ గారు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి గారిని, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారిని కలిసి ఆ మేరకు చెక్కును అందించారు. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు అండగా నిలిచినందుకు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు వారిని అభినందించారు.