టీడీపీకి షాక్.. టీఆర్ఎస్ లోకి ఎల్.రమణ ?

తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, మాజీ మంత్రి బీజేపీ నేత ఇనగాల పెద్దిరెడ్డి త్వరలో టీఆర్‍ఎస్‍లోకి రానున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల బీజేపీలోకి మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలోకి తీసుకునేందుకు అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై పెద్దిరెడ్డి అసంతృప్తితో ఉన్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ప్రకటించారు. రాజేందర్ బీజేపీలోకి రావడం ఖాయం కావడంతో పెద్దిరెడ్డి బీజేపీని వీడుతారనే అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన టీఆర్‍ఎస్ వైపు చూస్తున్నారని అంటున్నారు. టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ టీఆర్‍ఎస్‍లోకి రానున్నారనే ప్రచారం జోరందుకుంది. టీఆర్‍ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు పెద్దిరెడ్డి, రమణ ఆయనతో కలిసి పనిచేసిన వారే. వారిద్దరిని టీఆర్‍ఎస్‍లోకి కేసీఆర్ ఆహ్వానించే అవకాశం ఉందని అంటున్నారు.