మునుగోడు ఎమ్మెల్యేగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రమాణ స్వీకారం
మునుగోడు ఎమ్మెల్యేగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. శాసనసభలోని తన చాంబర్లో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, మహమూద్ అలీ, జగదీష్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజాప్రతినిధులు, అసెంబ్లీ కార్యదర్శి వీ నరసింహా చార్యులు పాల్గొన్నారు. అనంతరం కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి అసెంబ్లీ రూల్స్ బుక్స్, ఐడెంటిటీ కార్డును స్పీకర్ అందించారు.













