మాజీ ఎమ్మెల్యే కుర్రా సత్యనారాయణ సీఎం సహాయ నిధికి 25 లక్షల విరాళం
కరోనా వైరస్ నియంత్రణ కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు అండగా నిలిచేందుకు సంగారెడ్డి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శ్రీ కుర్రా సత్యనారాయణ సీఎం సహాయ నిధికి 25 లక్షల రూపాయల విరాళం ప్రకటించారు. దీనికి సంబంధించిన చెక్కును సీఎం శ్రీ కేసీఆర్ కు ప్రగతి భవన్ లో అందించారు. నర్సాపూర్ నియోజకవర్గానికి చెందిన మాసాయిపేట గ్రామ ప్రజలు సీఎం సహాయ నిధికి 2 లక్షల రూపాయల విరాళం ప్రకటించారు. దీనికి సంబంధించిన చెక్కును నర్సాపూర్ ఎమ్మెల్యే శ్రీ చినుముల మధన్ రెడ్డి సీఎం శ్రీ కేసీఆర్ కు ప్రగతిభవన్ లో అందించారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు, మెదక్ జిల్లా ఎంపి శ్రీ కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.













