దేశంలోని ఇతర రాష్ట్రాలు ఆయనను ఆదర్శంగా : అమెరికా పారిశ్రామికవేత్త కన్వల్
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ రాజకీయంగా భారత్ మొత్తానికి రోల్ మాడల్ అని అమెరికాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త కన్వల్ రేఖి ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ ద్యాస మొత్తం అభివృద్ధి, పెట్టుబడుల సాధనపైనే ఉంటుందని కొనియాడారు. దేశంలోని ఇతర రాష్ట్రాలు ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. భారతీయ అమెరికన్ అయిన రేఖి ప్రస్తుతం అమెరికాలోని ఇన్వెస్టస్ క్యాపిటల్ పార్ట్నర్స్ ఎండీగా పనిచేస్తున్నారు. అమెరికాలోని నాస్డాక్ స్టాక్ ఎక్స్చేంజీలో తన కంపెనీని లిస్ట్ చేసిన మొట్టమొదటి భారతీయ అమెరికన్ ఆయన. కన్వల్ అనేక సంస్థలను స్థాపించారు. ప్రఖ్యాత ఫాక్స్‌కాన్ సంస్థ తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెడుతున్నట్టు ప్రకటించారు. నేను కేటీఆర్‌ను అమెరికాలో, భారత్‌లో పలు మార్లు కలిశారు. ఆయన ఎప్పుడూ అభివృద్ధిపైనే దృష్టి కేంద్రీకరిస్తారు. మంత్రి కేటీఆర్‌ను ఇతర రాష్ట్రాలు రాజకీయంగా రోల్‌మాడల్‌గా తీసుకోవాలి. ఆయన ఏదో ఒకరోజు కేంద్ర ప్రభుత్వంలో పెద్ద స్థాయిలో కనిపిస్తారు. తన శక్తిని మొత్తం దేశం అభివృద్ధికి విస్తరిస్తారని ఆశిస్తున్నాను అని అన్నారు.













