మంత్రి కేటీఆర్ మరో స్కామ్ లో : బండి సంజయ్
తెలంగాణ రాష్ట్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. వేములవాడలో నిర్వహించిన సెస్ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో దొరికిపోయారన్నారు. ఆయన కుమారుడు (కేటీఆర్‌ను ఉద్దేశించి) మరో స్కామ్‌లో దొరికిపోతున్నారని ఆరోపించారు. కేటీఆర్ డ్రగ్ టెస్టుకు ఇప్పుడు వెంట్రుకలు తీసుకోమంటున్నారని, విదేశాల్లో ట్రీట్మెంట్ తీసుకొని వచ్చి ఇప్పుడు టెస్టుకు సిద్ధమంటున్నారని మండిపడ్డారు. డ్రగ్స్ కేసుల్లో మంత్రి కేటీఆర్ దోస్తులే ఉన్నారని ఆరోపించారు. హైదరాబాద్, బెంగళూరులో డ్రగ్స్ కేసులను దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.













