1984 నాటి ఫొటోను స్నేహితుడు పంపాడంటూ కేటీఆర్ ట్వీట్

తెలంగాణ ఐటీ, మున్సిపల్ మంత్రి కేటీఆర్ ఎప్పుడూ సోషల్ మీడియాలో అత్యంత చురుగ్గా ఉంటారు. ‘ఆస్క్ కేటీఆర్’ పేరిట ఓ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తూ ప్రజలడిగిన ప్రవ్నలకు సమాధానమిస్తుంటారు. అంతేకాకుండా తన కుటుంబానికి చెందిన ఫొటోలను, తన చిన్న నాటి ఫొటోలను కూడా అప్పుడప్పుడు షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా కేటీఆర్ మరోసారి తన చిన్ననాటి ఫొటోను షేర్ చేసి, అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. అయితే ఆ ఫొటోను తన స్నేహితుడు భరత్ పంపారని కేటీఆర్ వెల్లడించారు. ‘‘1984 సంవత్సరంలోనిది ఈ ఫొటో. కరీంనగర్ సెయింట్ జోసెఫ్ స్కూల్‌లో నాలుగో తరగతి చదువుతున్నప్పటి ఫొటో. నా స్నేహితుడు భరత్ నాకు పంపాడు. ఈ స్నేహితులందరి పేర్లను మళ్లీ ఓ సారి గుర్తు చేసుకున్నాను’’ అంటూ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.