మోదీ కు ఎన్నికల నియమాలు వర్తించవా.. కేటీఆర్

ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు వల్ల ఆయన ప్రచారంపై ఎన్నికల కమిషన్ 48 గంటల నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా మోదీ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ ద్వారా కౌంటర్ ఇచ్చారు. సెంట్రల్ లో కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధమనేది ఎప్పుడు జరిగేది. తాజాగా ఎన్డీఏకి అత్యధిక మెజారిటీ వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారని కాంగ్రెస్ నేతలు అన్నారు. ఇటు మోదీ.. కాంగ్రెస్ రాజ్యాంగాన్ని మార్చడానికి ప్రయత్నిస్తోందని..ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కోటాను జీహాదీ ఓటు బ్యాంక్ కట్టబెట్టడానికి ప్రయత్నిస్తోందని విమర్శించారు. అయితే వీరు మాట్లాడే మాటలు ప్రజలలో మత విద్వేషాన్ని సృష్టించే అవకాశం ఉంది.. ఇప్పటికే వివిధ పార్టీలు ఆయన వ్యాఖ్యల పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేటీఆర్ ఈ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. ఇది ఎన్నికల నియమ ఉల్లంఘన కాదా అని ఎన్నికల కమిషన్ పనితీరుని ప్రశ్నించారు. ప్రస్తుతం ఆయన ట్వీట్ వైరల్ అయింది.