రాష్ట్ర ప్రతిష్ఠను దెబ్బతీయాలని చూస్తే … సహించేది లేదు
తొమ్మిదిన్నరేళ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానం దేశ చరిత్రలోనే ఓ సువర్ణ అధ్యాయమని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ రాత్రి పగలూ తేడా లేకుండా చెమటోడ్చి తెలంగాణను నిర్మించామని, రాష్ట్ర ప్రతిష్ఠను దెబ్బతీయాలని చూస్తే సహించేది లేదన్నారు. తెలంగాణను విఫల రాష్ట్రంగా చూపే ప్రయత్నం చేస్తూ, అగ్రగామి రాష్ట్రాన్ని అవమానిస్తే ఎట్టిపరిస్థితుల్లో ఊరుకోబోమని హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే తొమ్మిదిన్నరేళ్ల బీఆర్ఎస్ పాలనపై స్వేదపత్రం పేరిట శనివారం తెలంగాణ భవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్లు తెలిపారు. గణాంకాలతో సహా వాస్తవ తెలంగాణ ముఖచిత్రాన్ని వివరించనున్నట్లు చెప్పారు. అప్పులు కాదు, రాష్ట్రం సృష్టించిన సంపదను ఆవిష్కరిస్తామన్నారు.













