కేటీఆర్‌కు మరో ఆహ్వానం
మరో అంతర్జాతీయ సదస్సులో ప్రసంగించాలని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావుకు ఆహ్వానం అందింది. భారత ప్రభుత్వం ఈ నెల 27న ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో తొలిసారి అంతర్జాతీయస్థాయిలో ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2017 సదస్సును నిర్వహిస్తున్నది. కమ్యూనికేషన్లశాఖ, సెల్యూలార్ ఆపరేటర్ల సంఘం కలిసి ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నాయి. ఇందులో సస్టైనబుల్ వైపై అంశంపై ప్రసంగించాలని కేటీఆర్‌ను కేంద్రమంత్రి మనోజ్ సిన్హా ప్రత్యేకంగా కోరుతూ లేఖ రాశారు. తెలంగాణ ఐటీశాఖ చేపట్టిన టీహబ్, తెలంగాణలోని స్మార్ట్ సిటీల మున్సిపల్ కార్పొరేషన్ కమిషనరేట్లతో ప్రత్యేక భాగస్వామ్యం కోరుకుంటున్నట్టు మనోజ్ సిన్హా లేఖలో పేర్కొన్నారు.













