ఈ ఫలితాలు తన బాధ్యతను మరింత పెంచాయి
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి భారీ విజయం అందించిన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని మరోసారి బలపరిచారు అని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత నుంచి ప్రతి ఎన్నికల్లో గెలుస్తూ వచ్చాం. 2014 నుంచి చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల వల్లే ఈ విజయం సాధ్యమైందన్నారు. మున్సిపల్ మంత్రిగా ఈ ఫలితాలు తన బాధ్యతను మరింత పెంచాయని కేటీఆర్ చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో విజయం కోసం కృషి చేసిన ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు. 100కు పైగా మున్సిపాలిటీల్లో విజయం సాధించడం గొప్ప విషయమని కేటీఆర్ పేర్కొన్నారు.













