దమ్ముంటే అభివృద్ధిలో పోటీపడండి : మంత్రి కేటీఆర్
తెలంగాణ మున్సిపల్, ఐటీ మంత్రి కేటీఆర్ సిద్దిపేటలోని ఇల్లంతకుంటలో పర్యటించారు. ఇల్లంతకుంటలో 30 పడకల ఆస్పత్రిని ఏర్పాటు చేస్తామని, నాలుగు లేన్ల రహదారితో పాటు ఇతర రోడ్లను కూడా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కేటీఆర్ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అభివృద్ధి విషయంలో ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా సీఎం కేసీఆర్ నిధులు మంజూరు చేస్తున్నారని, కొత్త పెన్షన్లు, రేషన్ కార్డులు కూడా త్వరలోనే అందజేస్తామని కేటీఆర్ పేర్కొన్నారు. నీటి సంరక్షణ విషయంలో దేశానికే పాఠాలు చెప్పే స్థాయికి తెలంగాణ ఎదిగిందని, ఎండకాలంలోనూ చెరువులు మత్తడి దుంకుతున్నాయని ఆనందం వ్యక్తం చేశారు.
మళ్లీ బండి సంజయ్‌పై విరుచుకుపడ్డ కేటీఆర్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై మంత్రి కేటీఆర్ మళ్లీ విరుచుకుపడ్డారు. ‘‘బండి సంజయ్‌ను సూటిగా అడుగుతున్నా… ఈ రెండేళ్లలో కరీంనగర్ పార్లమెంట్‌కు ప్రత్యేకంగా ఒక్క పైసా అయినా తెచ్చారా? మతం పేరుతో రెచ్చగొట్టడం, చిల్లర రాజకీయం చేయడం సరికాదు. దమ్ముంటే అభివృద్ధిలో తమతో పోటీపడాలి’’ అంటూ కేసీఆర్ సవాల్ విసిరారు. చైతనేతై కేంద్రం నుంచి అభివృద్ధికి నిధులు మంజూరు చేయించాలని, దమ్ముంటే కాళేశ్వరం, లేదా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా తీసుకొని రావాలని సవాల్ విసిరారు.













