టీ-శాట్ వార్షికోత్సవంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్
విద్యతో పాటు నైపుణ్యం పెంచేలా టీ-శాట్ కార్యక్రమాలు ఉన్నాయని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. టీ-శాట్ ఆరో వార్షికోత్సవం సందర్భంగా హైదరాబాద్ జూబ్లీహిల్స్లో జరిగిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ టీ-శాట్ పరిధిని మరింత విస్తృతం చేయాలని సూచించారు. పిల్లలకు పాఠాలు చెప్పే పద్ధతి మారాలని తెలిపారు. బోధనా పద్ధతుల కోసం మల్టీమీడియా ఉపయోగించాలని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రికేటీఆర్ సమక్షంలో ఉస్మానియా యూనివర్సిటీ, ఆహాతో టీ-శాట్ ఒప్పందం కుదుర్చుకున్నది.













