ఇది ఆకాంక్షలను పట్టించుకోని ఆంక్షల పద్దు : కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఇది ప్రజల ఆకాంక్షలను పట్టించుకోని ఆంక్షల పద్దు అని విమర్శించారు. గ్యారెంటీలను గంగలో కలిపేసిన కోతల, ఎగవేతల బడ్జెట్ అని ఎద్దేవా చేశారు. విధానం, విషయం, విజన్ లేదని, పేర్ల మార్పులతో ఏమార్చిన డొల్ల బడ్జెట్ ప్రవేశపెట్టారని ధ్వజమెత్తారు. వాగ్దానాలను గాలికొదిలిన వంచనల బడ్జెట్, డిక్లరేషన్లను బుట్టదాఖలు చేసిన దోకేబాజ్ బడ్జెట్ అంటూ మండిపడ్డారు. రైతులకు కత్తిరింపులు, అన్నదాతలకు సున్నం, ఆడబిడ్డలకు అన్యాయం. మహాలక్ష్ములకు మహామోసం. అవ్వాతాతలు, దివ్యాంగులు, నిరుపేదలు, నిస్సహాయులకు మొండిచేయి. పింఛన్ల పెంపు మాటెత్తలేదు. దళితులను దగా చేశారు. గిరిజనులను మోసం చేశారు. అంబేడ్కర్ అభయహస్తం ఊసులేదు. శూన్యహస్తమే మిగిలింది. బడుగు బలహీనవర్గాలకు భరోసాలేదు. వృత్తి కులాలపై కత్తికట్టారు అని మండిపడ్డారు.