కావాల్సిన వసతులు అందిస్తాం… హైదరాబాద్ లో వ్యాక్సిన్ టెస్టింగ్ సెంటర్ పెట్టండి : మంత్రి కేటీఆర్

హైదరాబాద్ నగరంలో వ్యాక్సిన్ టెస్టింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రి కే. తారక రామారావు కేంద్రాన్ని కోరారు. ఇందుకు ఫాస్ట్‌ట్రాక్ పద్ధతిన తమ ప్రభుత్వం కేంద్రానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చారు. అలాగే ఈ సెంటర్‌కు అవసరమైన భూమిని జినోమ్ వ్యాలీలోఅందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. హైదరాబాద్ నగరంలో టెస్టింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తే నెలకి 8 నుంచి 10 కోట్ల డోసులను అదనంగా ఉత్పత్తి చేయవచ్చని, ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో ఉపకరిస్తుందని సూచించారు. ప్రపంచ వ్యాక్సిన్ రాజధానిగా హైదరాబాద్ మారిందని, అందుకే హైదరాబాద్ నగరంలో ఈ టెస్టింగ్ సెంటర్ అత్యావశ్యకమని వివరించారు. ఒకవేళ ఇక్కడ వ్యాక్సిన్ టెస్టింగ్ సెంటర్‌ను ఉత్పత్తి చేస్తే రానున్న 6 నెలల్లోనే100 కోట్ల వ్యాక్సిన్ డోసులు ఉత్తత్పి అయ్యే అవకాశం ఉందని మంత్రి కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.