గ్రేటర్ ఎన్నికల్లో పొత్తు లేదు…కేటీఆర్
గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయంపై, పొత్తుపై రాష్ట్ర మంత్రి కే తారకరామారావు స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు. జీహెచ్ ఎం సీ ఎన్నికల్లో టీఆర్ ఎస్ కు ఎవరితోనూ పొత్తు లేదని ఒంటరిగానే 150 స్థానాల్లో పోటీ చేస్తామని తెలిపారు. తమ మిత్రపక్షం ఎంఐఎం తోనూ పొత్తు ఉండబోదని చెప్పారు. అలాగే మేయర్ సీటు తాము గెలుచుకుంటామన్నారు. గత ఎన్నికల్లో 5చోట్ల ఎంఐఎంను ఓడించామని ఈసారి 10 చోట్లకుపైగా ఎంఐఎంను ఓడిస్తామన్నారు కేటీఆర్. జీహెచ్ ఎం సీ ఎన్నికల్లో 150 సీట్లలో టీఆర్ ఎస్ అభ్యర్థులు పోటీచేస్తారు. ఎవరితో మాకు దోస్తీ లేదు. ఈసారి పాత బస్తీ లో పది సీట్లు గెలుస్తాం. ఎంఐఎంను ఓడగొట్టి ఆ సీట్లు గెలుస్తాం. మా అభ్యర్థి మేయర్ అవుతారు. బల్దియా మీద గులాబీ జెండా ఖచ్చితంగా ఎగరేస్తామన్నారు. 100 స్థానాల్లో గెలిస్తే తాము మేయర్ అవుతాం అని డిసెంబర్ నాలుగున టీఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి మహిళ మేయర్ గా కూర్చుంటుందని తమకు మరో ఆలోచన లేదని మంత్రి కేటీఆర్ అన్నారు.













