9న మెట్రో రైల్ రెండో దశ పనులకు శంకుస్థాపన
మైట్రో రైల్ విస్తరణ పనుల శంకుస్థాపన ఏర్పాట్లుపై తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సమీక్షించారు. ఈ సమీక్ష సమావేశానికి మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు. డిసెంబర్ 9వ తేదీన మైట్రో రైల్ రెండో దశ పనులకు సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమంపై చర్చించారు. ప్రజా రవాణా వ్యవస్థ బలోపేతానికి కారిడార్ దోహదపడుతుందని కేటీఆర్ పేర్కొన్నారు. శంకుస్థాపన ప్రాంతంలో రెండు రోజుల్లో ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. మైండ్‌స్పేస్ జంక్షన్ వద్దగల రాయదుర్గం మెట్రో టర్నినల్ నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు మెట్రో రైల్ మార్గాన్ని నిర్మించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించిన సంగతి తెలిసిందే.













