ఆ సమస్యకు వెంటనే ముగింపు పలకండి : మంత్రి కేటీఆర్
నిజాం కాలేజ్లో విద్యార్థినుల ఆందోళనపై తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. హాస్టల్ సౌకర్యం కల్పించాలంటూ అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థినులు గత కొద్దిరోజులుగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో ఈ సమస్యపై కేటీఆర్ స్పందిస్తూ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమస్యను పరిష్కరించాలని ఆమెను కోరారు. తాను ఇచ్చిన మాట ప్రకారం హాస్టల్ నిర్మాణం చేసి కాలేజీకి అందించిన తర్వాత కూడా ఈ వివాదం అనవసరమని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ సమస్యను వెంటే ముగింపు పలకాలని నిజాం కాలేజ్ ప్రిన్సిపల్ను ఆయన ఆదేశించారు.













