టాన్సిట్ వారెంట్ లేకుండా కవితను ఎలా అరెస్టు చేస్తారు : కేటీఆర్

ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఎమ్మెల్సీ కవితను ఎలా అరెస్టు చేస్తారని దర్యాప్తు అధికారిని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అరెస్టు చేయమంటూ సుప్రీంకోర్టు కు మాట ఇచ్చి, ఇప్పుడు ఎలా అరెస్టు చేశారు? అని ప్రశ్నించారు. కావాలనే శుక్రవారం వచ్చారు. సర్వోన్నత న్యాయస్థానానికి ఇచ్చిన మాట తప్పుతున్న ఈడీ అధికారులు కోర్టు ద్వారా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అని హెచ్చరించారు. సోదాలు ముగిసిన తర్వాత కూడా ఇంట్లోకి రావొద్దంటూ హుకుం జారీ చేసిన ఈడీ అధికారులపై ఆయన మండిపడ్డారు.