బీజేపీ ఆదేశాల మేరకే .. అదానీతో సీఎం రేవంత్
కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలను ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ మొన్నటివరకు ప్రధాని, అదానీ ఒకటేనని సీఎం రేవంత్ మాట్లాడారు. ఇవాళ దావోస్ సాక్షిగా అదానీతో అలయ్ బలయ్ చేసుకున్నారు. బీజేపీ అదేశాల మేరకే అదానీతో రేవంత్ కలిసి పని చేస్తున్నారు. ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడతారు. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలను ప్రజలకు ఎప్పటికప్పుడు గుర్తు చేయాలి. రూ.2 లక్షల రుణమాఫీ ఒకే విడతలో చేస్తామని రేవంత్ రెడ్డి అన్నారు. దశలవారీగా చేస్తామని ఇప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి అంటున్నారు. ఎరువుల కోసం రైతులు లైన్లో నిలబడే పరిస్థితులు మళ్లీ వచ్చాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు కాదు, ఆస్తులు సృష్టించింది. బంగారు పల్లెంలో పెట్టి తెలంగాణను కాంగ్రెస్కు అప్పగించాం అని అన్నారు.













