అమెరికాకు మరిన్ని విమనాలు నడిపేలా కృషి : మంత్రి కేటీఆర్
తెలుగు రాష్ట్రాల నుంచి అమెరికాకు నేరుగా మరిన్ని విమానాలు నడిపేలా కృషి చేస్తున్నామని, దీనిపై యూఎస్ కాన్సులేట్ అధికారులతో చర్చిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల నుంచి పెద్దసంఖ్యలో ప్రయాణికులు అమెరికాకు వెళ్తున్నారని, వారి సౌలభ్యం కోసం నేరుగా విమానాలను నడపాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రస్తుతం వారానికి రెండు రోజులు షికాగోకు నేరుగా విమానాలున్నాయని, దీంతో పాటు న్యూయార్క్, డల్లాస్, శాన్ఫ్రాన్సిస్కో నగరాలకు సైతం నడపాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో విమానాల మ్యూజియం ఏర్పాటుకు కృషి చేస్తామని మంత్రి తెలిపారు.













