మరోసారి తమ పార్టీ అధికారంలోకి వస్తే :మంత్రి కేటీఆర్
కాంగ్రెస్ హయాంలో రూ.200 పింఛను మాత్రమే వచ్చేదని, ఇప్పుడు రూ.2 వేలు ఇస్తున్న ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ అన్నారు. కామారెడ్డి జిల్లా బిక్కనూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ మరోసారి తమ పార్టీ అధికారంలోకి వస్తే పింఛను రూ.3 వేలు చేస్తామని, వచ్చే ఐదేళ్లలో దాన్ని రూ.5 వేలకు పెంచుతామని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో బీడీ కార్మికులు, ఒంటరి మహిళలకు పింఛను ఉండేదా? బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో 46 లక్షల మందికి పింఛను ఇస్తున్నాం. 16 రాష్ట్రాల్లో బీడీ కార్మికులు ఉన్నారు. ఏ రాష్ట్రంలోనూ అక్కడి ప్రభుత్వాలు వారికి పింఛను ఇవ్వడం లేదు. దేశంలో బీడీ కార్మికులకు పింఛను ఇస్తున్న ఏకైక సీఎం కేసీఆర్. మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడితే సౌభాగలక్ష్మి పథకం కింద కేసీఆర్ కొత్త పథకం తీసుకొస్తారు. ఆ పథకం కింద 18 ఏళ్లు నిండిన మహిళలకు రూ.3 వేలు అందజేస్తామన్నారు.













