పొన్నాల లక్ష్మయ్యను ఆహ్వానించిన మంత్రి కేటీఆర్
సీనియర్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్యకు బీఆర్ఎస్ నుంచి ఆహ్వానం అందింది. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన పొన్నాల లక్ష్మయ్య ఇంటికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ వెళ్లి పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. పొన్నాల ఇంటికి మంత్రి కేటీఆర్‌తో పాటు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, శానంపూడి సైదిరెడ్డి, సీనియర్ నాయకులు దాసోజు శ్రవణ్ వెళ్లారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ పొన్నాల లక్ష్మయ్యను బీఆర్ఎస్లోకి ఆహ్వానించేందుకు వచ్చానని తెలిపారు. సీఎం కేసీఆర్ సూచన మేరకే పొన్నాల ఇంటికి వచ్చానని పేర్కొన్నారు. పార్టీలో చేరేందుకు పొన్నాల సుముఖత వ్యక్తం చేశారు. ఆయనకు బీఆర్ఎస్లో సముచిత స్థానం కల్పిస్తామన్నారు. రేపు పొన్నాల సీఎం కేసీఆర్‌ను కలుస్తారు. సీఎంను కలిసిన తర్వాత పొన్నాల తుది నిర్ణయం ప్రకటిస్తారని కేటీఆర్ స్పష్టం చేశారు.













