జనగామ లొల్లి ముగిసింది.. ఆయన్ను గెలిపించాలన్న కేటీఆర్
జనగామ నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలతో తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మధ్య ఆయన సయోధ్య కుదిర్చారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డికి టికెట్ కేటాయించామని, ఆయన్ను గెలిపించాలని జనగామ నేతలకు కేటీఆర్ కోరారు. జనగామ టికెట్ విషయంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి మధ్య పోటీ ఏర్పడిరది. ఈసారి ముత్తిరెడ్డి స్థానంలో పల్లాకు టికెట్ ఇవ్వాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే ముత్తిరెడ్డికి ఆర్టీసీ చైర్మన్ పదవికి కేటాయించారు.













