హైదరాబాద్లో బయో ఆసియా సదస్సు
ఈ ఏడాది బయో ఆసియా సదస్సుకు హైదరాబాద్ నగరం ఆతిథ్యమివ్వనుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ సదస్సుకు 55 దేశాల నుంచి 1800 మంది ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగ నిపుణులు, ప్రతినిధులు హాజరవుతారన్నారు. టీఎస్ఐఐసీ కార్యాలయంలో బయో ఆసియా-2020 వెబ్సైట్ను మంత్రి ప్రారంభించి మాట్లాడారు. సదస్సుకు స్విట్జర్లాండ్ భాగస్వామి దేశంగా, జర్మనీ సంయుక్త భాగస్వామిగా ఉన్నాయని తెలిపారు. అసోం, కేరళ, తెలంగాణ రాష్ట్రాలు భాగస్వాములుగా హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, టీఎస్ఐఐసీ ఎండీ నరసింహారెడ్డి పాల్గొన్నారు.













