మంత్రి కేటీఆర్ కు మరో అరుదైన గౌరవం
తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్కు మరో అరుదైన గౌరవం దక్కింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) 2023 దావోస్లో నిర్వహించే వార్షిక సదస్సుకు హాజరుకావాలని ఆయనకు ప్రత్యేక ఆహ్వానం పంపించింది. స్విట్జర్లాండ్లోని దావోస్లో జవనరి 16 నుంచి 20 వరకు జరిగే సదస్సుకు ప్రపంచ దేశాల నుంచి పలు కంపెనీల సీఈవోలు, చైర్మన్లు, దేశంలోని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు హాజరు కానున్నారు. ఐదు రోజుల పాటు జరిగే సదస్సులో మంత్రి కేటీఆర్ ఏయే రోజుల్లో హాజరవుతారు? అనే విషయం అధికారికంగా ప్రకటించాల్సి ఉన్నది.













