మంత్రి కేటీఆర్ కు మరో ప్రతిష్ఠాత్మక ఆహ్వానం
పంజాబ్‌లోని మొహాలీలో గల ప్రతిష్ఠాత్మక ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ)లో వచ్చే నెల 11న అడ్వాన్స్డ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ ఇన్ పబ్లిక్ పాలసీ కోర్సును ప్రారంభించి, ప్రసంగించాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ను ఐఎస్బీ డీన్ మదన్ పిల్లుట్ల ఆహ్వానించారు. తెలంగాణ ఏర్పాటు నుంచి ఐఎస్బీకి మీ సహకారం, ప్రోత్సాహం, మార్గనిర్దేశం అమూల్యమైనవి. మీ అనుభవాలను ఐఎస్బీ విద్యార్థులతో పంచుకోవడం ఎంతో ఉపయోగకరం. ప్రభుత్వ విధానాల రూపకల్పన, లక్ష్యాలను అందుకోవడం తదితర అంశాలపై సమగ్ర అవగాహనకు మీ ప్రసంగం దోహదపడుతుంది అని కేటీఆర్‌నుద్దేశించి మదన్ పేర్కొన్నారు.













