పంచతత్వ పార్కును ప్రారంభించిన మంత్రి కేటీఆర్
మానసిక ప్రశాంతతతోపాటు స్వచ్ఛమైన గాలి దొరికేలా ఔషధ మొక్కలతో పంచతత్వ పార్క్‌ను ఏర్పాటు చేసినట్లు తెలంగాణ రాష్ట్ర మున్సిపల్‌శాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు. హైదారబాద్‌లోని ఇందిరాపార్కులో నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణలోని తొలి పంచతత్వ పార్కును ఆయన ప్రారంభించారు. ఇందులో ఆక్యూప్రెషర్ (శరీరంపై ఒత్తిడి నివారించే) వాకింగ్ ట్రాక్‌తో పాటు ఔషధమొక్కలతో నవగ్రహవనం, రాశివనం ఉన్నాయి. కాగా నగరంలోని ఆరు జోన్లలో 16 పంచతత్వ పార్కులు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్, నగర మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే ముఠాగోపాల్ తదితరులు పాల్గొన్నారు.













