సిద్దిపేటలో టీ హబ్ ఏర్పాటు చేస్తాం : మంత్రి కేటీఆర్
సిద్దిపేట పట్టణ శివారులోని నాగులబండ వద్ద రాజీవ్ రహదారిని ఆనుకొని నిర్మించిన ఐటీ టవర్‌ను తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కలలోనైనా సిద్దిపేటకు ఐటీ హబ్ వస్తుందని అనుకున్నామా? రాష్ట్రమే రాకపోతే సిద్దిపేట జిల్లా అయ్యేదా? సిద్దిపేటకు సీఎం కేసీఆర్ బలమైన పునాది వేశారు. తెలంగాణకు ఆయువుపట్టు సిద్దిపేట. ఐటీ టవర్ ప్రారంభంతో సిద్దిపేటలో 1500 మందికి ఉపాధి వచ్చింది. సిద్దిపేటకు పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తాం. ఐటీ టవర్ ప్రారంభం రోజునే సంస్థలు వచ్చి ఉద్యోగాలు ఇవ్వడం చాలా గొప్ప పరిణామం. ఐటీ హబ్‌కు మరిన్ని నిధులు మంజూరు చేసి విస్తరిస్తాం. సిద్ధిపేటలో టీ హబ్ ఏర్పాటు చేస్తాం. 2014లో రాష్ట్రం ఏర్పడిన నాడు రాష్ట్రంలో ఐటీ ఎగుమతులు కేవలం రూ.56 కోట్లు మాత్రమే. ఇవాళ రూ.2.41 లక్షల కోట్ల ఐటీ ఎగుమతులకు చేరుకున్నామని తెలిపారు.













