ఈ నెల 9న మలేషియాకు కేటీఆర్

మలేషియా తెలంగాణ అసోసియేషన్ ( మైటా) దశాబ్ది ఉత్సవాలకు ముఖ్య అతిథిగా కేటీఆర్ హాజరుకానున్నారు. మైటా ప్రతినిధులు కేటీఆర్‌ను ఆయన నివాసంలో కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పదేండ్ల క్రితం మైటాను ప్రారంభించగా, ఈ నెల 9న దశాబ్ది ఉత్సవాలను నిర్వహిస్తున్నది. దీంతో కేటీఆర్ మలేషియాకు వెళ్లనున్నారు.