ఐ-తెలంగాణ 2017 సదస్సు ప్రారంభం
హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో ఐ-తెలంగాణ 2017 సదస్సును తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సదస్సులో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఈ-వేస్ట్ మేనేజ్మెంట్ పాలసీలను మంత్రి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సైయెంట్ చైర్మన్ బీవీఆర్ మోహన్‌రెడ్డి, ఫిక్కీ సెక్రటరీ జనరల్ సంజయ్ బారు, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్‌తో పాటు పలువురు పాల్గొన్నారు. ఇదే ప్రాంగణంలో టీ-ఎయిర్ సమ్మిట్‌ను హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రారంభించారు. టీ ఎయిర్ సమ్మిట్ మూడు రోజులపాటు కొనసాగనుంది. ఈ సదస్సులో ఇంటర్నెట్, రోబోటిక్స్‌పై చర్చించనున్నారు.













