కవిత కేసుపై ఢిల్లీ న్యాయవాదులతో కేటీఆర్ చర్చలు..

లోక్ సభ ఎన్నికలు జరగడానికి అంటే ముందే తెలంగాణలో రాజకీయాలలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన కవితను ఈడి ఢిల్లీకు తరలించబోతోంది. రేపు కవితను ఈడీ రౌస్ అవెన్యూ కోర్టు ముందు హాజరు పరచనుంది. ఈ నేపథ్యంలో కేటీఆర్ కూడా ఢిల్లీకి బయలుదేరారు. కవిత అరెస్టుకు సంబంధించిన వివరాలను ఢిల్లీలోని న్యాయవాదులతో చర్చించడానికి కేటీఆర్ వెళ్లినట్లు సమాచారం. అంతేకాకుండా ఆమె అరెస్టుపై సుప్రీంకోర్టులో పిటీషన్ను కూడా దాఖలు చేయబోతున్నారట.ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితను అరెస్టు చేయడం ఈడీ కు చాలా పెద్ద టాస్క్ గా మారింది. ఒకపక్క కవిత ఇంట్లో సోదాలు మొదలుపెట్టిన వెంటనే.. బీఆర్ఎస్ కార్యకర్తలు ఆమె ఇంటిని చుట్టుముట్టి పెద్ద ఎత్తున ఆందోళనలు మొదలుపెట్టారు. కవితను అరెస్టు చేసి తీసుకు వెళుతున్న అధికారులను వారు అడ్డుకున్నారు. ఈడీ గో బ్యాక్.. అని నినాదాలు చేస్తూ ఆమెను తీసుకువెళ్తున్న కారుకు అడ్డం పడ్డారు. హై టెన్షన్ మధ్య.. అతి కష్టం మీద ఆమెను శంషాబాద్ విమానాశ్రయానికి తరలించారు. ఈ నేపథ్యంలో కవిత కోసం అనుసరించవలసిన వ్యూహాలపై చర్చించడానికి కేటీఆర్ ఢిల్లీ చేరుకున్నారు. ఎలాగైనా ఈ కేసు నుంచి కవితను బయట వేయడానికి కేటీఆర్ పూనుకున్నారు. మరి ఈ కేస్ ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.