బండి సంజయ్కు కేటీఆర్ సవాల్.. దమ్ముంటే గంగులపై
తెలంగాణ రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్, బీజేపీ పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కరీంనగర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ కరీంనగర్ పార్లమెంట్ నియోజవకర్గం నుంచి ఎంపీగా గెలిచిన బండి సంజయ్ పైసా పని కూడా చేయలేదని విమర్శించారు. మూడేళ్ల కాలంలో సంజయ్ ఏం అభివృద్ధి చేశారని సూటిగా ప్రశ్నించారు. వర్గాల పేరుతో ప్రజల మధ్య పంచాయతీ పెట్టడం తప్ప బండి సంజయ్కు ఏదీ చేతకాదని ఎద్దేవా చేశారు. పార్లమెంట్లో కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కూడా మాట్లాడలేదని కేటీఆర్ ఫైరయ్యారు. రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ను తిట్టడం, పనికి మాలిన మాటలు మాట్లాడం తప్ప ఇంకేమీ తెలియదన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్కు కేటీఆర్ సవాల్ విసిరారు. బండి సంజయ్కు ధైర్యం ఉంటే వచ్చే ఎన్నికల్లో మంత్రి గంగులపై కమలాకర్పై పోటీ చేయాలని సవాల్ చేశారు. కమలాకర్ను లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని అన్నారు.













