లండన్‌లో కేటీఆర్ జన్మదిన వేడుకలు

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను లండన్‌లో ఘనంగా నిర్వహించారు. ఎన్నారై బీఆర్‌ఎస్ యూకే శాఖ అధ్యక్షుడు అశోక్‌గౌడ్ దూసరి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో యూకే కమిటీ ప్రధాన కార్యదర్శి, టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల, నాయకులు నవీన్‌రెడ్డి, ప్రవీణ్ వీర, హరిగౌడ్ నవాబీపేట్, శ్రీకాంత్ జెల్ల, సత్య చిలుముల, జాయింట్ సెక్రటరీ మల్లారెడ్డి బీరం, సతీశ్‌రెడ్డి గొట్టెముక్కుల, రవిప్రదీప్ పులుసు, రవి రేతినేని పాల్గొన్నారు.