లండన్‌లో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పుట్టినరోజును లండన్‌లో ఘనంగా నిర్వహించారు. టీఆర్ఎస్ ఎన్నారై అడ్వైజరి బోర్డు చైర్మన్ పోచారం సురేందర్ రెడ్డి కేక్ కట్ చేశారు. కేటీఆర్ పిలుపు మేరకు గిప్ట్ ఏ స్మైల్‌లో భాగంగా కామారెడ్డి జిల్లా పోచారం గ్రామ ప్రభుత్వ పాఠశాలలో వ్యక్తిగత ఖర్చుతో వసతుల కల్పనకు శ్రీకారం చుట్టామన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ ఎన్నారై వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం, టీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు అశోక్‌గౌడ్ దూసరి, ఉపాధ్యక్షుడు నవీన్‌రెడ్డి, అడ్వైజరీ బోర్డు సభ్యులు దొంతుల వెంకట్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి రత్నాకర్ కడుదుల, కార్యదర్శులు సత్య చిలుముల, సృజన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.













