కేటీఆర్కు మరో ప్రతిష్ఠాత్మక అవార్డు
తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు మరో ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని కైవసం చేసుకున్నారు. ఇప్పటికే పలు జాతీయ అవార్డులను దక్కించుకున్న మంత్రికి ఈ సారి లీడర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కింది. ప్రముఖ మీడియా సంస్థ బిజినెస్ వరల్డ్ మంత్రి కేటీఆర్కు ఈ అవార్డును ప్రదానం చేయనుంది. ఈ నెల 20న ఢిల్లీలో జరిగే ఐదవ జాతీయ బిజినెస్ వరల్డ్ మంత్రికి ఆహ్వానం పంపింది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్సింగ్ సూరి తదితరులు పాల్గొనే ఈ సమావేశంలో అవార్డును ప్రదానం చేయనున్నారు.













