సమ్మె విరమించండి… లేదంటే చర్యలు తప్పవ్ : కేటీఆర్ హెచ్చరిక

ఓ వైపు కరోనా, మరోవైపు బ్లాక్ ఫంగస్… ఇంతటి క్లిష్ట సమయంలో తెలంగాణలో జూనియర్ డాక్టర్లు సమ్మె చేపట్టారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిరసన ప్రదర్శనలు చేపడుతున్నారు. అత్యవసర సేవలు మినహా ఇతర విధులను బహిష్కరించారు. పెంచిన స్టైఫండ్, కోవిడ్ ప్రోత్సాహకాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్ స్పందించింది. రాష్ట్ర మున్సిపల్, ఐటీ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జూడాలు చేస్తున్న సమ్మెను వెంటనే విరమించాలని మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో చర్యలు తప్పవని తీవ్రంగా హెచ్చరించారు. సమ్మె చేయడానికి ఇది సరైన సమయం కాదని, జూడాల సమస్యలను ప్రభుత్వం పరిశీలిస్తోందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.