ఇది పాలమూరు విజయం
కృష్ణా ట్రైబ్యునల్ తీర్పు పాలమూరు విజయమని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. పాలమూరు ఎత్తిపోతల పథకంపై ఏపీ దాఖలు చేసిన ఇంటర్‌లొకేటరీ అప్లికేషన్‌పై కృష్ణా ట్రైబ్యునల్ తీర్పును మంత్రి స్వాగతించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు 90 టీఎంసీల వరకు కృష్ణా జిలాలు తీసుకోవచ్చని స్పష్టం చేశారు. తాజా తీర్పు ద్వారా సబ్ జ్యూడిస్ అడ్డంకి తొలగిపోయినట్లుగా భావించవచ్చని తేల్చి చెప్పారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోత పథకానికి ఇప్పటికే కేంద్ర అటవీ పర్యావరణ, మోటా, కేంద్ర భూగర్భ జలశాఖ, విద్యుత్ ప్రాధికార సంస్థ, కేంద్ర మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ లాంటి సంస్థల అన్ని రకాల అనుమతులు వచ్చాయని వెల్లడించారు. సీఎం కేసీఆర్ పట్టుదలే ఈ విజయానికి కారణమని ప్రశంసించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల అడ్డంకులు కేంద్రం వెంటనే తేల్చాలని డిమాండ్ చేశారు.













