టీఆర్ఎస్ ను వీడే ప్రసక్తే లేదు
తనకు రాజకీయాల్లో జన్మనిచ్చింది వైఎస్ఆర్ అయితే పునర్జున్మనిచ్చింది కేసీఆర్ అని కొండా సురేఖ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ తాము టీఆర్ఎస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని సృష్టం చేశారు. టీఆర్ఎస్ వీడుతున్నట్లు కొందరూ దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఇక తన రాజకీయ వారసురాలు కుమార్తె సుస్మితా పటేల్ అని అన్నారు. అయితే 2019 ఎన్నికల్లో తమ కుమార్తె పోటీ చేసే విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నామంటూ తామంటే గిట్టనివారు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు.













