నేను పార్టీ మారితే 10 వేల కోట్లు ఇస్తారు… కానీ మాకు
వైఎస్ షర్మిల నుంచి పిలుపు వచ్చిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కొండా మురళీధర్‌రావు అన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రం హన్మకొండలోని ఆయన నివాసలో వరంగల్ తూర్పు నియోజకవర్గ పార్టీ శ్రేణులతో కొండా మురళీధర్‌రావు, కొండా సురేఖ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ పార్టీని వీడబోమని తెలిపారు. నేను పార్టీ మారితే వైఎస్ షర్మిల 10 వేల కోట్ల రూపాయలు ఇస్తారని తెలిపారు. కానీ మాకు విలువలే ముఖ్యం డబ్బు కాదు అని అన్నారు. ఓటమి భయంతోనే కరోనా విజృంభిస్తున్న సమయంలో కూడా టీఆర్ఎస్ ఎన్నికలు పెట్టిందని విమర్శించారు.













