మీడియాతో కొన్ని చెప్పకూడదు.. కారణం ఇదే
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కలిశారు. ప్రధాని భేటీ అనంతరం కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గంలో జాతీయ రహదారులపై చర్చించానని పేర్కొన్నారు. ఎల్బీ నగర్ నుంచి మెట్రో రైల్ పొడిగించాలని కోరానన్నారు. కొన్ని అంశాలు మీడియాతో చెప్పలేనివి ఉంటాయి . అన్ని అంశాలపై ప్రధాని చాలా సానుకూలంగా స్పందించారు. రెండు, మూడు నెలలో అన్ని మంజూరు చేసే అవకాశం ఉంది. ప్రధానికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. తెలంగాణలో వడగళ్ల వానతో రైతులు నష్ట పోయారు. కేంద్రం నుంచి పరిశీలనకు బృందాన్ని పంపాలని కోరాను అని అన్నారు.













