కాంగ్రెస్ కు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి షాక్
తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నికల హీట్ కొనసాగుతోంది. ఇలాంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. అయితే ఇప్పటి వరకు మునుగోడు ఉప ఎన్నికల కోసం భువనగిరి ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ ప్రచారం చేస్తారని అంతా భావించారు. కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి కూడా కోమటి రెడ్డి ప్రచారానికి వస్తారనే పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. కానీ అనూహ్యంగా కోమటిరెడ్డి అందరికీ షాకిచ్చారు. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి దూరంగా ఉండనున్నట్లు సమాచారం. ఈ నెల 15వ తేదీన కోమటిరెడ్డి తన కుటుంంతో కలిసి ఆస్ట్రేలియాకు వెళ్లనున్నారు. మునుగోడు ఉప ఎన్నిక ముగిసిన తర్వాతే ఆయన మళ్లీ హైదరాబాద్ తిరిగి వచ్చే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది.ఈ విషయాన్ని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. కోమటిరెడ్డి స్టార్ క్యాంపెయినర్‌గా ప్రచారానికి వస్తే హస్తం పార్టీకి అనుకూలంగా ఉండేది. కానీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇలా ఎన్నికల సమయంలో నియోజకవర్గంలో అందుబాటులో లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.













