ఆయనే మునుగోడు ఉప ఎన్నికల్లో గెలిపిస్తాడు : వెంకట్ రెడ్డి
మునుగోడు ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్లనని భునవగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ మునుగోడులో తన లాంటి హోమ్ గార్డ్స్ ప్రచారం అసవరం లేదని అన్నారు. ఎస్పీ స్థాయి నేతలే అక్కడ ప్రచారానికి వెళ్తారని యెద్దేవా చేశారు. వంద కేసులు పెట్టినా సరే ప్రభుత్వాన్ని తీసుకొస్తానని ఓ నేత చెప్పాడు. ఆయనే మునుగోడు ఉప ఎన్నికల్లో గెలిపిస్తాడు. నాతో ఏం పని?. కడియం శ్రీహరికి నన్ను విమర్శించే స్థాయి లేదు. రాజయ్యను అడిగితే కడియం చరిత్ర చెబుతాడు. నేనెప్పుడు విదేశాలకు వెళ్లేది కేటీఆర్‌ను అడగండి అంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేవారు.













