స్టార్ క్యాంపెనర్‌గా బాధ్యతలు అప్పగిస్తే… ప్రచారం
దక్షిణ తెలంగాణపై సీఎం కేసీఆర్ సవతి ప్రేమ చూపిస్తున్నాడని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో సర్దార్ సర్వాయి పాపన్న, ధర్మభిక్షం విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించాడు. అనంతరం చౌటుప్పల్ నుంచి మల్కాపూర్ వెళ్లే రహదారి పనులు పరిశీలించారు. సీఎం కేసీఆర్ సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్‌లో మాత్రమే వేల కోట్లతో అభివృద్ధి చేస్తున్నాడని అన్నారు. మునుగోడు ఎన్నికల్లో స్టార్ క్యాంపెనర్‌గా బాధ్యతలు అప్పగిస్తే ప్రచారం చేస్తానని తెలిపారు.













