పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందడానికే… ఈడీ దాడులు: కోమటిరెడ్డి

బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత నివాసంలో ఈడీ చేపట్టిన సోదాలు పలు అనుమానాలకు తావిస్తున్నాయని తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల నోటిఫికేషన్ వేళ సోదాలు ఎవరి కోసమని ప్రశ్నించారు. శనివారం నోటిఫికేషన్ వస్తున్న క్రమంలో ఈ దాడులేంటి? అని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డే స్వయంగా, కవిత అరెస్టు కాబోతోందని గతంలో చెప్పారు. ఇప్పటివరకు ఎందుకు అరెస్టు చేయలేదు? బీఆర్‌ఎస్, బీజేపీ నేతులు గల్లీలో కొట్టుకుంటారు. ఢిల్లీలో దోస్తీ చేస్తారు. పార్లమెంట్ ఎన్నికల్లో లబ్దిపొందడానికే ఇరుపార్టీల రహస్య ఒప్పందంలో భాగంగానే ఇప్పుడు సోదాలు చేస్తున్నారు అని విమర్శించారు.