ఏపీలో, కర్ణాటకలో బీఆర్ఎస్ ఎందుకు పోటీ చేయదు? : కోమటిరెడ్డి
తెలంగాణలో విద్యుత్ సమస్య తీవ్రంగా ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆరోపించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ 24 గంటల కరెంట్ ఇస్తున్నట్లు ప్రభుత్వం నిరూపిస్తే వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయబోనని స్పష్టం చేశారు. విద్యుత్ లేక పంటలు ఎండిపోతున్నాయన్నారు. కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యమని, కడవరకూ పార్టీలోనే ఉంటానని తేల్చి చెప్పారు. పరీక్షల నిర్వహణలో టీఎస్పీఎస్సీ పూర్తిగా విఫలమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పారదర్శకంగా పరీక్షలు నిర్వహిస్తాం. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు 15వ తేదీన ఇస్తున్నారు. ఝార్ఖండ్లో కూడా ఒకటో తేదీనే జీతాలు పడతాయి. రాష్ట్ర మంత్రులు నాతో వస్తే కర్ణాటకలో అమలవుతున్న పథకాలు చూపిస్తా. స్పెషల్ ఫ్లైట్ పెడతాను. ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో బీఆర్ఎస్ ఎందుకు పోటీ చేయదు? అని ప్రశ్నించారు.













