ఆయనకు ఎప్పుడూ ఎక్కడ దోచుకుందామా అనే ఆలోచనలే : మంత్రి కోమటిరెడ్డి
సూర్యాపేటలో తాగేందుకు నీళ్లు లేక ఇక్కడి ప్రజలు మూసీ నీళ్లు తాగుతుంటే, అవసరం లేకున్నా ఉత్తర తెలంగాణ కోసం గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుకు కట్టిందని తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శించారు. నల్గొండలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ జిల్లాలో బీఆర్ఎస్ రూ.300 కోట్లు ఖర్చు పెట్టి ఒక్క సీటు మాత్రమే గెలిచిందన్న ఆయన, తాము సూర్యాపేటలో ప్రచారం చేసి ఉంటే 70 వేల కోట్లతో జగదీశ్ రెడ్డి ఓడిపోయేవారన్నారు. ఎస్ఎల్బీసీపై మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఒక్కసారి కూడా సమీక్ష చేయలేదు. ఆయనకు ఎప్పుడూ ఎక్కడ దోచుకుందామా అనే ఆలోచనలే ఉంటాయి. యాదాద్రి థర్మల్ ప్లాంట్ ప్రాజెక్టులో అవినీతి జరిగింది. కీలక శాఖలన్నీ తన వద్దే పెట్టుకని కేసీఆర్ దోపిడీకి పాల్పడ్డారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్టైన హెచ్ఎండీఏ డైరెక్టర్ బాలకృష్ణనే ఆయన దోపిడీకి ఉదాహరణ. అతడు రూ.వందల కోట్ల అక్రమ సంపాదనతో దొరికాడు. మాజీ సీఎస్ సోమేశ్ కుమార్‌కి ఐదు వేల ఎకరాలున్నాయి. ఆయన బండారం త్వరలో బయటపడుతుంది. అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ అధినేత అడ్డంగా దోచుకొని ఇప్పుడు పక్కదారి పట్టిస్తున్నారు. ఆయన ఇంకా ప్రైవేటు విమానం లీజు క్యాన్సిల్ చేసుకోలేదు. దుబాయ్ పారిపోవచ్చనే లీజును కొనసాగిస్తురేమో. అన్ని విషయాలు అసెంబ్లీలో బయటపడతాయి అని తెలిపారు.













