దేవుడి దగ్గర రాజకీయాలా? బాధాకరం : కోమటిరెడ్డి
ముఖ్యమంత్రి కేసీఆర్ దేవుడి దగ్గర రాజకీయాలు చేయడం బాధాకరమని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. యాదాద్రి ఆలయ ఉద్ఘాటన కార్యక్రమానికి స్థానిక ప్రజాప్రతినిధినైన తనను పిలవలేదని అన్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి కార్యాలయం ప్రోటోకాల్‌ను పాటించలేదని ఆక్షేపించారు. స్థానిక ఎంపీగా నన్ను పున ప్రారంభానికి పిలవలేదని ఆరోపించారు. అధికార పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలను మాత్రమే ఆహ్వానించడం శోచనీయమన్నారు. తాను కాంగ్రెస్ ఎంపీ కావడం వల్లనే కేసీఆర్ తనను యాదాద్రి పున: ప్రారంభోతవ్సవ వేడుకలకు ఆహ్వానించ లేదని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇలా వ్యవహరించడం ఎంత వరకు సబబు అని ఆయన ప్రశ్నించారు.













