కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు.. తొలి సంతకం ఫైల్ అదే
కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. తొలి సంతకం రూ.2లక్షల రుణమాఫీ పైనే చేస్తామని హామీ ఇచ్చారు. ఆగస్టు నెలాఖరుకు కాంగ్రెస్ బస్సు యాత్ర చేపడతాం. తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలంతా పర్యటిస్తాం. ఎన్నికలపై సర్వేలన్నీ కాంగ్రెస్ గెలుస్తోందని చెబుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది. ఎన్నికల్లో గెలుస్తుందనే నమ్మకం ఉంది. భువనగిరి అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్‌ను గెలిపిస్తాను అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉద్యోగాలను పారదర్శకంగా ఇస్తామన్నారు. 24 గంటల కరెంట్‌పై కేసీఆర్ ప్రభుత్వం చెప్పేవన్నీ అబద్దాలే అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో 24 గంటల కరెంట్ ఇస్తాం. విచ్చలవిడిగా భూములు అమ్మేస్తున్నారు. 50 వేల కోట్లు మద్యం అమ్మకాల మీద వస్తున్నాయి. ఆ పైసలన్నీ ఎటుపోతున్నాయి అని ప్రశ్నించారు.













