నాలుగైదు సార్లు ఓడిపోయిన వారితో నేను కూర్చోవాలా?
కాంగ్రెస్ అధిష్ఠానం తనకు ఇచ్చిన షోకాజ్ నోటీసులు ఎప్పుడో చెత్తబుట్టలో పడ్డాయని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల నూతన ఇన్ఛార్జ్ మాణిక్ రావు ఠాక్రేతో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పీసీసీ కమిటీలను నేను పట్టించుకోను. నాలుగైదుసార్లు ఓటమి పాలైన వాళ్లతో నేను కూర్చోవాలా? అని వ్యాఖ్యానించారు. పార్టీ కోసం కష్టపడిన వారికి అన్యాయం జరిగింది. మా ఫొటోలను మార్ఫింగ్ చేస్తే ఏఐసీసీ పట్టించుకోలేదు. నా ఫొటో మార్పింగ్ చేశారని స్వయానా సీపీనే చెప్పారు. బిజీగా ఉండటం వల్లే గాంధీభవన్‌కు రాలేదు. ఎమ్మెల్యేలు సీతక్క, వీరయ్య, జగ్గారెడ్డి ఎందుకు ఠాక్రేను కలవలేదో ముందు అడగాలి. నియోజకవర్గ పర్యటనలో ఉన్నందునే నేను మాణిక్ రావు ఠాక్రేను కలవలేకపోయాను అని స్పష్టం చేశారు.













